కొత్తగా రిలీజ్ అయిన సినిమాకు నేను నా పిల్లలతో థీయేటరుకు వెళ్ళాను.' టిక్కెట్టు ఎంతండీ? " ఆని అడిగాను.....
" కొత్త సినిమా కదా! అందులో ప్రముఖ హీరో సినిమా మరి.,.ఒక్కొక్క టికెట్టు 500 రూ. ఇవ్వమంటారా? " కౌంటరులోని వ్యక్తి........ఒక్కనిమిషం ఆలోచించాను.......మేము నలుగురం . అంటే 2000 రూ. ఒక్క 2 గంటల సినిమాకు ఖర్చు........వెంటనే సినిమా హాలు బయటకు వచ్చి ఆటో ఎక్కాను. ఆటోవాలా " ఎక్కడికి వెళ్ళాలి సార్ ?" అని అడిగాడు.పిల్లలు.........భార్య కాస్త దిగులుగా ఉన్నట్టు అనిపించింది. అయినాసరే అనుకుని ఆటోవాలాతో పక్కనే ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్ళమని చెప్పేశాను. ఆటోవాలా కూడా మమ్మల్ని అక్కడ దింపేసి వెళ్ళిపోయాడు.
వృద్ధాశ్రమంలోకి వెళ్ళి ఒకపూట ఈ వృద్ధులకు భోజనానికి ఎంత అవుతుందని అడిగాను.......ఆశ్రమంలోని వ్యక్తి 1500 రూ. అవుతుందని చెప్పగానే " నా దగ్గర 2000 రూ. ఉన్నాయి........ఈ పూటకు ఈ పెద్దవాళ్ళకు భోజనాలు పెట్టించండి....మరొక చిన్న విన్నపం.....నాకు నా తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. మేము కూడా ఈ రోజు ఇక్కడే భోంచేసి మా పిల్లలు తాతయ్యలతో, నాన్నమ్మలతో, అమ్మమ్మలతో గడుపడానికి మాకు అవకాశాన్ని ఇవ్వండి దయచేసి " అని అన్నాను.
సినిమాకు తీసుకెళ్ళకుండా ఇక్కడికి తీసుకుని వచ్చానని నాపై కాసేపు అలిగినా........అక్కడ ఆ పెద్దలతో ఆటలు....పాటలు కథలతో మా పిల్లలు ......మేము చాలా సంతోషంగా గడిపి వచ్చాము....భోంచేసి బయటికి రాగానే ఒక పెద్దమ్మ నన్ను నా కుటుంబాన్ని ఇలా దీవించింది......." మాకు కూడా మనవళ్ళు.........మనవరాళ్ళు ఉన్నారు. వారితో ఆడుకోవాలని ఎన్నెన్నో కథలు చెప్పాలని ఉండేది ...మాకు భోజనాన్ని అందించడమే కాకుండా మా సొంత కొడుకులా మాతో గడిపి వెళుతున్నందుకు మీరు మీ కుటుంబం కలకాలం సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళూ ఆనందంగా ఉండాలని ఈ పండుటాకు దీవిస్తోంది. నీలాంటి వారికి దేవుడు అన్ని విధాలుగా తోడుగా ఉంటాడు......జాగ్రత్తగా వెళ్ళిరండి ". నా భార్య కళ్ళల్లో ఓ గర్వంతో కూడిన ఆనందం......నా పిల్లల మొహంలో సినిమాకు వెళ్ళినా కనపడని సంతోషం కనిపించింది.......మంచి పనిచేశానన్న తృప్తితో ఇంటికివచ్చాను........
చదవండి చక్కగా ఆచరింప చేయండి మన మనస్సు ఎంత ఆనందపడుతుంది ఇలా చేస్తే.
I Did my part of contribution to the needy people as much as I can on this special day.
Celebrate the New year by filling happiness in someone's life.
Welcome 2021 with lots of Joy .
Happy New year 💐🎊🎉
Comments
Post a Comment